Vaidika Vignanam
Back

Open In Vignanam Mobile App

ఆలోకయే శ్రీ బాలకృష్ణం

రాగం: హుసేని
తాళం: ఆది

పల్లవి
ఆలోకయే శ్రీ బాల కృష్ణం
సఖి ఆనంద సుందర తాండవ కృష్ణమ్ ॥ఆలోకయే॥

చరణం 1
చరణ నిక్వణిత నూపుర కృష్ణం
కర సంగత కనక కంకణ కృష్ణమ్ ॥ఆలోకయే॥

కింకిణీ జాల ఘణ ఘణిత కృష్ణం
లోక శంకిత తారావళి మౌక్తిక కృష్ణమ్ ॥ఆలోకయే॥

చరణం 2
సుందర నాసా మౌక్తిక శోభిత కృష్ణం
నంద నందనం అఖండ విభూతి కృష్ణం

కంఠోప కంఠ శోభి కౌస్తుభ కృష్ణం
కలి కల్మష తిమిర భాస్కర కృష్ణం

నవనీత ఖంఠ దధి చోర కృష్ణం
భక్త భవ పాశ బంధ మోచన కృష్ణమ్ ॥ఆలోకయే॥

నీల మేఘ శ్యామ సుందర కృష్ణం
నిత్య నిర్మలానంద బోధ లక్షణ కృష్ణం

వంశీ నాద వినోద సుందర కృష్ణం
పరమహంస కుల శంసిత చరిత కృష్ణమ్ ॥ఆలోకయే॥

చరణం 3
గోవత్స బృంద పాలక కృష్ణం
కృత గోపికా చాల ఖేలన కృష్ణం

నంద సునందాది వందిత కృష్ణం
శ్రీ నారాయణ తీర్థ వరద కృష్ణమ్ ॥ఆలోకయే॥

Vaidika Vignanam