Vaidika Vignanam
Back

Open In Vignanam Mobile App

అన్నమయ్య కీర్తన చందమామ రావో


రాగం: బేహాగ్/అహీర్భైరవ్,సౌరాష్ట్ర/రాగమాలిక
ఆ: స రి1 గ3 మ1 ప ని2 ద2 మ1 ప ద2 స
అవ: స ని2 ద2 ప మ1 ప గ3 రి1 స
తాళం: రూపక/ఆది

పల్లవి
చందమామ రావో జాబిల్లి రావో
కుందనపు పైడి కోర వెన్న పాలు తేవో ॥ (2.5)

చరణం 1
నగుమోము చక్కని యయ్యకు నలువ బుట్టించిన తండ్రికి
నిగమము లందుండే యప్పకు మా నీల వర్ణునికి । (2)
జగమెల్ల నేలిన స్వామికి చక్కని ఇందిర మగనికి
ముగురికి మొదలైన ఘనునికి మా ముద్దుల మురారి బాలునికి ॥ (1.5)
కుందనపు పైడి కోర వెన్న పాలు తేవో .
చందమామ రావో జాబిల్లి రావో
కుందనపు పైడి కోర వెన్న పాలు తేవో (1.5)

చరణం 2
తెలిదమ్మి కన్నుల మేటికి మంచి తియ్యని మాటల గుమ్మకు
కలికి చేతల కోడెకుమా కతల కారి ఈ బిడ్డకు । (2)
కుల ముద్ధించిన పట్టెకు మంచి గుణములు కలిగిన కోడెకు
నిలువెల్ల నిండు వొయ్యారికి నవ నిధుల చూపుల జూసే సుగుణునకు॥ (1.5)
కుందనపు పైడి కోర వెన్న పాలు తేవో
చందమాచ్మ రావో జాబిల్లి రావో
కుందనపు పైడి కోర వెన్న పాలు తేవో (1.5)

చరణం 3
సురల గాచిన దేవరకు చుంచు గరుడుని నెక్కిన గబ్బికి
నెరవాది బుద్ధుల పెద్దకు మా నీటు చేతల పట్టికి । (2)
విరుల వింటి వాని యయ్యకు వేవేలు రూపుల స్వామికి
సిరిమించు నెరవాది జాణకు మా శ్రీ వేంకటేశ్వరునికి ॥ (1.5)
కుందనపు పైడి కోర వెన్న పాలు తేవో
చందమామ రావో జాబిల్లి రావో
కుందనపు పైడి కోర వెన్న పాలు తేవో (2.5)

Vaidika Vignanam