Vaidika Vignanam
Back

Open In Vignanam Mobile App

అన్నమయ్య కీర్తన చేరి యశోదకు


రాగం: హంసధ్వని
22 ఖరహరప్రియ జన్య
ఆ: స గ2 మ1 ప ని2 ప స
అవ: స ని2 ప మ1 గ2 స
తాళం: ఆది

పల్లవి
చేరి యశోదకు శిశు వితడు
ధారుణి బ్రహ్మకు తండ్రియు నితడు ॥ (2.5)

చరణం 1
సొలసి చూచినను సూర్యచంద్రులను
లలి వెదచల్లెడులక్షణుడు । (2)
నిలిచిననిలువున నిఖిలదేవతల
కలిగించు సురలగనివో యితడు । (2)
చేరి యశోదకు శిశు వితడు (1.5) (ప..)

చరణం 2
మాటలాడినను మరియజాండములు
కోటులు వోడమేటిగుణరాశి । (2)
నీటగునూర్పుల నిఖిలవేదములు
చాటువనూ రేటిసముద్ర మితడు ॥ (2)
చేరి యశోదకు శిశు వితడు (1.5) (ప..)

చరణం 3
ముంగిట జొలసిన మోహన మాత్మల
బొంగించేఘనపురుషుడు । (2)
సంగతి మావంటిశరణాగతులకు
నంగము శ్రీవేంకటాధిపు డితడు ॥ (2)
చేరి యశోదకు శిశు వితడు (2.5) (ప..)

Vaidika Vignanam