రాగం: ఖమాస్ / వరాళి
ఆ: స మ1 గ3 మ1 ప ద2 ని2 స
అవ: స ని2 ద2 ప మ1 గ3 రి2 స
తాళం: ఆది
పల్లవి
డోలాయాం చల డోలాయాం హరే డోలాయాం ॥ (3)
చరణం 1
మీనకూర్మ వరాహా మృగపతిఅవతారా । (2)
దానవారే గుణశౌరే ధరణిధర మరుజనక ॥
డోలాయాం చల డోలాయాం హరే డోలాయాం ॥
చరణం 2
వామన రామ రామ వరకృష్ణ అవతారా । (2)
శ్యామలాంగా రంగ రంగా సామజవరద మురహరణ ॥
డోలాయాం చల డోలాయాం హరే డోలాయాం ॥
చరణం 3
దారుణ బుద్ద కలికి దశవిధఅవతారా । [3]
శీరపాణే గోసమాణే శ్రీ వేంకటగిరికూటనిలయ ॥ (2)
డోలాయాం చల డోలాయాం హరే డోలాయాం ॥