Vaidika Vignanam
Back

Open In Vignanam Mobile App

అన్నమయ్య కీర్తన ఏలే ఏలే మరదలా


రాగం: పాడి,ఝన్జూటి
ఆ: స రి1 మ1 ప ని3 స
అవ: స ని3 ప ద1 ప మ1 రి1 స
తాళం: ఆది
పల్లవి
ఏలే యేలే మరదలా చాలుజాలు ।
చాలును చాలు నీతోడి సరసంబు బావ ॥

చరణం 1
గాటపు గుబ్బలు గదలగ గులికేవు ।
మాటల దేటల మరదలా ।
చీటికి మాటికి జెనకేవే వట్టి ।
బూటకాలు మానిపోవే బావ ॥

చరణం 2
అందిందె నన్ను నదలించి వేసేవు ।
మందమేలపు మరదలా ।
సందుకో దిరిగేవి సటకారివో బావ ।
పొందుగాదిక బోవే బావ ॥

చరణం 3
చొక్కపు గిలిగింతల చూపుల నన్ను ।
మక్కువ సేసిన మరదలా ।
గక్కున నను వేంకటపతి కూడితి ।
దక్కించుకొంటివి తగులైతి బావ ॥

Vaidika Vignanam