రాగం: బౌళి
ఆ: స రి1 గ3 ప ద1 స
అవ: స ని3 ద1 ప గ3 రి1 స
తాళం: ఆది
పల్లవి
ఎండగాని నీడగాని యేమైనగాని
కొండల రాయడె మాకులదైవము ॥ (3.5)
చరణం 1
తేలుగాని పాముగాని దేవపట్టయినగాని (2)
గాలిగాని ధూళిగాని కానియేమైన ।
కాలకూటవిషమైనా గ్రక్కున మింగిన నాటి-
నీలవర్ణుడేమా నిజదైవము ॥
ఎండగాని నీడగాని యేమైనగాని
కొండల రాయడె మాకులదైవము ॥ (ప..)
చరణం 2
చీమగాని దోమగాని చెలది ఏమైనగాని (2)
గాముగాని నాముగాని కానియేమైన ।
పాములనిన్నిటి మ్రింగె బలుతేజిపై నెక్కు
ధూమకేతువేమో దొరదైవము ॥
ఎండగాని నీడగాని యేమైనగాని
కొండల రాయడె మాకులదైవము ॥ (ప..)
చరణం 3
పిల్లిగాని నల్లిగాని పిన్న ఎలుకైన గాని (2)
కల్లగాని పొల్లగాని కాని ఏమైన ।
బల్లిదుడై వేంకటాద్రి పైనున్న యాతడి
మమ్మెల్ల కాలము నేలేటి యింటిదైవము ॥
ఎండగాని నీడగాని యేమైనగాని
కొండల రాయడె మాకులదైవము ॥ (ప..) (3.5)