రాగం: బేగడ
ఆ: స గ3 రి2 గ3 మ1 ప ద2 ని2 ద2 ప స
అవ: స ని3 ద2 ప మ1 గ3 రి2 స
తాళం: క్/చాపు
పల్లవి
ఇతరులకు నిను నెరుగదరమా ॥
సతతసత్యవ్రతులు సంపూర్ణమోహవిర-
హితులెరుగుదురు నిను నిందిరారమణా ॥
చరణం 1
నారీ కటాక్ష పటు నారాచ భయరహిత-
శూరులెరుగుదురు నిను జూచేటి చూపు । (2)
Gఒరసంసార సంకుల పరిచ్ఛేదులగు-
ధీరులెరుగుదురు నీదివ్య విగ్రహము ॥
ఇతరులకు నిను నెరుగదరమా.. (ప..)
చరణం 2
రాగభోగవిదూర రంజితాత్ములు మహా-
భాగులెరుగుదురు నిను బ్రణుతించువిధము । (2)
ఆగమోక్తప్రకారాభిగమ్యులు మహా-
యోగులెరుగుదురు నీవుండేటివునికి ॥
ఇతరులకు నిను నెరుగదరమా.. (ప..)
చరణం 3
పరమభాగవత పదపద్మసేవానిజా-
భరణు లెరుగుదురు నీపలికేటిపలుకు । (2)
పరగునిత్యానంద పరిపూర్ణమానస-
స్థిరు లెరుగుదురు నిను దిరువేంకటేశ ॥
ఇతరులకు నిను నెరుగదరమా ॥
సతతసత్యవ్రతులు సంపూర్ణమోహవిర-
హితులెరుగుదురు నిను నిందిరారమణా ॥