రాగం: సామంత
ఆ: స రి2 గ3 మ1 ప ద3 ని3 స
అవ: స ని3 ద3 ని3 ద3 ప మ1 గ3 రి2 స
తాళం: ఆది
పల్లవి
కోడెకాడె వీడె వీడె గోవిందుడు
కూడె ఇద్దరు సతుల గోవిందుడు ॥ (2.5)
చరణం 1
గొల్లెతల వలపించె గోవిందుడు
కొల్లలాడె వెన్నలు గోవిందుడు । (2)
గుల్ల సంకుఀజక్రముల గోవిందుడు
గొల్లవారింట పెరిగె గోవిందుడు ॥ (2)
కోడెకాడె వీడె వీడె గోవిందుడు.. (ప..)
చరణం 2
కోలచే పసులగాచె గోవిందుడు
కూలగుమ్మె కంసుని గోవిందుడు । (2)
గోలయై వేల కొండెత్తె గోవిందుడు
గూళెపుసతుల~మ దెచ్చె గోవిందుడు ॥ (2)
కోడెకాడె వీడె వీడె గోవిందుడు.. (ప..)
చరణం 3
కుందనపు చేలతోడి గోవిందుడు
గొందులు సందులు దూరె గోవిందుడు । (2)
కుందని శ్రీవేంకటాద్రి గోవిందుడు
గొంది~మ దోసె నసురల గోవిందుడు ॥ (2)
కోడెకాడె వీడె వీడె గోవిందుడు
కూడె ఇద్దరు సతుల గోవిందుడు ॥ (ప..) (2.5)