రాగం:బొవ్ళి (15 మాయమాళవ గొవ్ళ జన్య)
ఆ: స రి1 గ3 ప ద1 స
అవ: స ని3 ద1 ప గ3 రి1 స
తాళం: ఆది
పల్లవి
శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ ।
శ్రీమన్నారాయణ నీ శ్రీపాదమే శరణు ॥
చరణం 1
కమలాసతీ ముఖకమల కమలహిత ।
కమలప్రియ కమలేక్షణ ।
కమలాసనహిత గరుడగమన శ్రీ ।
కమలనాభ నీపదకమలమే శరణు ॥
శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ..(ప..)
చరణం 2
పరమయోగిజన భాగధేయ శ్రీ ।
పరమపూరుష పరాత్పర
పరమాత్మ పరమాణురూప శ్రీ ।
తిరువేంకటగిరి దేవ శరణు ॥
శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ ।
శ్రీమన్నారాయణ నీ శ్రీపాదమే శరణు ॥