Vaidika Vignanam
Back

Open In Vignanam Mobile App

అన్నమయ్య కీర్తన తిరుమల గిరి రాయ


రాగం: పాడి / పహాడి (29 ధీర శన్కరాభరణం జన్య)/మోహన
ఆ: స రి2 గ3 ప ద2 స
అవ: స ద2 ప గ3 రి2 స
తాళం: ఆది

పల్లవి
తిరుమలగిరిరాయ దేవరాహుత్తరాయ ।
సురతబిన్నాణరాయ సుగుణకోనేటిరాయ ॥

చరణం 1
సిరులసింగారరాయ చెలువపుతిమ్మరాయ ।
సరసవైభవరాయ సకలవినోదరాయ । (2)
వరవసంతములరాయ వనితలవిటరాయ । (2)
గురుతైన తేగరాయ కొండలకోనేటిరాయ ॥ (2)
తిరుమలగిరిరాయ దేవరాహుత్తరాయ..(ప..)

చరణం 2
గొల్లెతలవుద్దండరాయ గోపాలకృష్ణరాయ ।
చల్లువెదజాణరాయ చల్లబరిమళరాయ । (2)
చెల్లుబడిధర్మరాయ చెప్పరానివలరాయ । (2)
కొల్లలైన భోగరాయ కొండలకోనేటిరాయ ॥ (2)
తిరుమలగిరిరాయ దేవరాహుత్తరాయ..(ప..)

చరణం 3
సామసంగీతరాయ సర్వమోహనరాయ ।
ధామవైకుంఠరాయ దైత్యవిభాళరాయ । (2)
కామించి నిన్ను గోరితే గరుణించితివి నన్ను । (2)
శ్రీమంతుడ నీకు జయ శ్రీవేంకటరాయ ॥ (2)
తిరుమలగిరిరాయ దేవరాహుత్తరాయ ।
సురతబిన్నాణరాయ సుగుణకోనేటిరాయ ॥

Vaidika Vignanam