Vaidika Vignanam
Back

Open In Vignanam Mobile App

అన్నమయ్య కీర్తన వేదం బెవ్వని


రాగం: పాడి
ఆ: స రి1 మ1 ప ని3 స
అవ: స ని3 ప ద1 ప మ1 రి1 స
తాళం:

పల్లవి
వేదం బెవ్వని వెదకెడివి ।
ఆదేవుని గొనియాడుడీ ॥

చరణం 1
అలరిన చైతన్యాత్మకు డెవ్వడు ।
కలడెవ్వ డెచట గలడనిన ।
తలతు రెవ్వనిని దనువియోగదశ ।
యిల నాతని భజియించుడీ ॥

వేదం బెవ్వని వెదకెడివి ।
ఆదేవుని గొనియాడుడీ ॥

చరణం 2
కడగి సకలరక్షకు డిందెవ్వడు ।
వడి నింతయు నెవ్వనిమయము ।
పిడికిట తృప్తులు పితరు లెవ్వనిని ।
దడవిన ఘనుడాతని గనుడు ॥

వేదం బెవ్వని వెదకెడివి ।
ఆదేవుని గొనియాడుడీ ॥

చరణం 3
కదసి సకలలోకంబుల వారలు ।
యిదివో కొలిచెద రెవ్వనిని ।
త్రిదశ వంద్యుడగు తిరువేంకటపతి ।
వెదకి వెదకి సేవించుడీ ॥

వేదం బెవ్వని వెదకెడివి ।
ఆదేవుని గొనియాడుడీ ॥

Vaidika Vignanam