Vaidika Vignanam
Back

Open In Vignanam Mobile App

అన్నమయ్య కీర్తన వేడుకొందామా


వేడుకొందామా వేంకటగిరి వేంకటేశ్వరుని ॥

ఆమటి మ్రొక్కుల వాడె ఆదిదేవుడే వాడు ।
తోమని పళ్యాలవాడె దురిత దూరుడే ॥

వడ్డికాసుల వాడె వనజనాభుడే పుట్టు ।
గొడ్డురాండ్రకు బిడ్డలిచ్చే గోవిందుడే ॥

ఎలిమి గోరిన వరాలిచ్చే దేవుడే వాడు ।
అలమేల్మంగా శ్రీవేంకటాద్రి నాథుడే ॥

Vaidika Vignanam