Vaidika Vignanam
Back

Open In Vignanam Mobile App

దేవీ మాహాత్మ్యం మంగళ హారతి

శ్రీ చక్ర పుర మందు స్థిరమైన శ్రీ లలిత పసిడి పాదాలకిదె నీరాజనం
బంగారుతల్లికిదె నీరాజనం

బంగారు హారాలు సింగారమొలకించు అంబికా హృదయకు నీరాజనం
బంగారుతల్లికిదె నీరాజనం

శ్రీ గౌరి శ్రీమాత శ్రీమహారాజ్ఞి శ్రీ సింహాసనేశ్వరికి నీరాజనం
బంగారుతల్లికిదె నీరాజనం

కల్పతరువై మమ్ము కాపాడు కరములకు కవకంబు కాసులతో నీరాజనం
బంగారుతల్లికిదె నీరాజనం

పాశాంకుశ పుష్ప బాణచాపధరికి పరమ పావనమైన నీరాజనం
బంగారుతల్లికిదె నీరాజనం

కాంతి కిరణాలతో కలికి మెడలో మెరిసె కల్యాణ సూత్రమ్ము నీరాజనం
బంగారుతల్లికిదె నీరాజనం

చిరునవ్వు లొలికించు శ్రీదేవి అధరాన శతకో టి నక్షత్ర నీరాజనం
బంగారుతల్లికిదె నీరాజనం

కలువరేకుల వంటి కన్నుల తల్లి శ్రీరాజరాజేశ్వరికి నీరాజనం
బంగారుతల్లికిదె నీరాజనం

ముదమార మోమున ముచ్చటగ దరియించు కస్తూరి కుంకుమకు నీరాజనం
బంగారుతల్లికిదె నీరాజనం

చంద్రవంకనికిదె నీరాజనం

శుక్రవారమునాడు శుభములొసగే తల్లి శ్రీ మహాలక్ష్మి కిదె నీరాజనం
బంగారుతల్లికిదె నీరాజనం

ముగ్గురమ్మలకును మూలమగు పెద్దమ్మ ముత్యాలతో నిత్య నీరాజనం
బంగారుతల్లికిదె నీరాజనం

శృంగేరి పీఠాన సుందరాకారిణి సౌందర్యలహరికిదె నీరాజనం
బంగారుతల్లికిదె నీరాజనం

సకల హృదయాలలో బుద్ధిప్రేరణ జేయు తల్లి గాయత్రికిదె నీరాజనం
బంగారుతల్లికిదె నీరాజనం

దాన నరసింహుని దయతోడ రక్షించు దయగల తల్లికిదె నీరాజనం
ఆత్మార్పణతో నిత్య నీరాజనం

శ్రీ చక్ర పుర మందు స్థిరమైన శ్రీ లలిత పసిడి పాదాలకిదె నీరాజనం
బంగారుతల్లికిదె నీరాజనం

Vaidika Vignanam