Vaidika Vignanam
Back

Open In Vignanam Mobile App

త్యాగరాజ కీర్తన బంటు రీతి కొలువు


రాగం: హంసనాదం
60 నీతిమతి జన్య
ఆ: స రి2 మ2 ప ద3 ని3 స
అవ: స ని3 ద3 ప మ2 రి2 స
తాళం: దేశాది

పల్లవి
బంటు రీతి కొలువీయ వయ్య రామ (బంటు)

అనుపల్లవి
తుంట వింటి వాని మొదలైన
మదాదుల బట్టి నేల కూలజేయు నిజ
బంటు రీతి కొలువీయ వయ్య రామ.. (బంటు)

చరణం 1
రోమాంచమనే, ఘన కంచుకము
రామ భక్తుడనే, ముద్రబిళ్ళయు
రామ నామమనే, వర ఖఢ్గమి-
-విరాజిల్లునయ్య, త్యాగరాజునికే

బంటు రీతి కొలువీయ వయ్య రామ (బంటు)

Vaidika Vignanam