రాగం: బహుదారి
28 హరికాంబోజి జన్య
ఆ: స గ3 మ1 ప ద2 ని2 స
అవ: స ని2 ప మ1 గ3 స
తాళం: దేశాది
పల్లవి
బ్రోవ భారమా, రఘు రామ
భువనమెల్ల నేవై, నన్నొకని
అనుపల్లవి
శ్రీ వాసుదేవ! అండ కోట్ల
కుక్షిని ఉంచుకోలేదా, నన్ను
బ్రోవ భారమా, రఘు రామ.. (ప..)
చరణం 1
కలశాంబుధిలో దయతో
అమరులకై, అది గాక
గోపికలకై కొండలెత్త లేదా
కరుణాకర, త్యాగరాజుని
బ్రోవ భారమా, రఘు రామ
భువనమెల్ల నేవై, నన్నొకని