Vaidika Vignanam
Back

Open In Vignanam Mobile App

త్యాగరాజ కీర్తన నగుమోము గనలేని

రాగం: ఆభేరి (మేళకర్త 22, కరహరప్రియ జన్యరాగ)
ఆరోహణ: శ్ ఘ2 ం1 ఫ్ ణ2 శ్
అవరోహణ: శ్ ణ2 డ2 ఫ్ ం1 ఘ2 ఱ2 శ్

తాళం: ఆది
రూపకర్త: త్యాగరాజ
భాషా: తెలుగు

పల్లవి
నగుమోము గనలేని నాజాలి తెలిసి నను బ్రోవగ రాదా శ్రీ రఘువర నీ

అనుపల్లవి
నగరాజధర నీదు పరైవార లెల్ల ఒగిబోధన జేసే వారలు గారే యిటు లుండుదురె
(నగుమోము)

చరణం
ఖగరాజు నీ యానతి విని వేగ చనలేదో గగనాని కిలకు బహు దూరంబనినాదో
జగమేలె పరమాత్మ ఎవరితో మొరలిడుదు వగ జూపకు తాళను నన్నేలుకోర త్యాగరాజనుత నీ
(నగుమోము)

Vaidika Vignanam