Vaidika Vignanam
Back

Open In Vignanam Mobile App

వందనము రఘునందన

రాగం: శహన రాగము
తాళం: ఆది తాళము

పల్లవి
వందనము రఘునందన - సేతు
బంధన భక్త చందన రామ

చరణము(లు)
శ్రీదమా నాతో వాదమా - నే
భేదమా ఇది మోదమా రామ

శ్రీరమా హృచ్చార మము బ్రోవ
భారమా రాయబారమా రామ

వింటిని నమ్ము కొంటిని శర
ణంటిని రమ్మంటిని రామ

ఓడను భక్తి వీడను నొరుల
వేడను జూడను రామ

కమ్మని విడె మిమ్మని వరము
కొమ్మని పలుక రమ్మని రామ

న్యాయమా నీ కాయమా ఇంక
హేయమా ముని గేయమా రామ

చూడుమీ గాపాడుమీ మమ్ము
పోడిమిగా (గూడుమీ రామ

క్షేమము దివ్య ధామము నిత్య
నీమము రామనామము రామ

వేగరా కరుణాసాగర శ్రీ
త్యాగరాజు హృదయాకర రామ

Vaidika Vignanam