ఏ దేశమేగినా ఎన్దు కాలెడినా
ఏ పీఠమెక్కినా, ఎవ్వరేమనినా,
పొగడరా నీ తల్లి భూమి భారతిని,
నిలపరా నీ జాతి నిణ్డు గౌరవము.
ఏ పూర్వ పుణ్యమో, ఏ యోగ బలమో
జనియిఞ్చినాడ వీ స్వర్గఖణ్డమున
ఏ మఞ్చిపూవులన్ ప్రేమిఞ్చినావో
నిను మోచె ఈ తల్లి కనక గర్భమున.
లేదురా ఇటువణ్టి భూదేవి యెన్దూ
లేరురా మనవణ్టి పౌరులిఙ్కెన్దు.
సూర్యునీ వెలుతురుల్ సోకునన్దాక,
ఓడలా ఝణ్డాలు ఆడునన్దాక,
అన్దాక గల ఈ అనన్త భూతలిని
మన భూమి వణ్టి చల్లని తల్లి లేదు
పాడరా నీ వీర భావ భారతము.
తమ తపస్సులు ఋషుల్ ధారవోయఙ్గా
సౌర్య హారముల్ రాజచన్ద్రులర్పిమ్ప
భావ సూత్రము కవి ప్రభువులల్లఙ్గ
రాగ దుగ్ధముల్ భక్తరత్నముల్ పిదక
దిక్కులకెగదన్ను తేజమ్ము వెలగ
రాళ్ళ తేనియలూరు రాగాలు సాగా
జగములనూగిఞ్చు మగతనమ్బెగయ
సౌన్దర్యమెగ బోయు సాహిత్యమలర
వెలిగినదీ దివ్య విశ్వమ్బుపుత్ర
దీవిఞ్చె నీ దివ్య దేశమ్బు పుత్ర
పొలములా రత్నాలు మొలిచెరా ఇచట
వార్ధిలో ముత్యాలు పణ్డెరా ఇచట
పృథివి దివ్యౌషధుల్ పిదికెరా మనకూ
కానలా కస్తూరి కాచరా మనకు.
అవమానమేలరా ? అనుమానమేలరా ?
భారతేయుడనఞ్చు భక్తితో పాడ!