శిరిడీవాసా సాయిప్రభో జగతికి మూలం నీవే ప్రభో
దత్త దిగమ్బర అవతారం నీలో సృష్టి వ్యవహారమ్ ॥
త్రిమూర్తిరూపా ఓ సాయీ కరుణిఞ్చి కాపాడోయి
దర్శనమియ్య గరావయ్య ముక్తికి మార్గం చూపుమయా ॥ 1 ॥
శిరిడీవాసా సాయిప్రభో ॥
కఫిని వస్త్రము ధరియిఞ్చి భుజముకు జోలీ తగిలిఞ్చి
నిమ్బ వృక్షపు ఛాయలో ఫకీరు వేషపు ధారణలో
కలియుగమన్దున వెలసితివి త్యాగం సహనం నేర్పితివి
శిరిడీ గ్రామం నీ వాసం భక్తుల మదిలో నీ రూపమ్ ॥ 2 ॥
శిరిడీవాసా సాయిప్రభో ॥
చాన్ద్ పాటిల్ ను కలుసుకుని ఆతని బాధలు తెలుసుకుని
గుర్రము జాడ తెలిపితివి పాటిల్ బాధను తీర్చితివి
వెలిగిఞ్చావు జ్యోతులను నీవుపయోగిఞ్చి జలములను
అచ్చెరువొన్దెను ఆ గ్రామం చూసి విన్తైన ఆ దృశ్యమ్ ॥ 3 ॥
శిరిడీవాసా సాయిప్రభో ॥
బాయిజా చేసెను నీ సేవ ప్రతిఫలమిచ్చావో దేవా
నీ ఆయువును బదులిచ్చి తాత్యాను నీవు బ్రతికిఞ్చి
పశుపక్షులను ప్రేమిఞ్చి ప్రేమతో వాటిని లాలిఞ్చి
జీవులపైన మమకారం చిత్రమయా నీ వ్యవహారమ్ ॥ 4 ॥
శిరిడీవాసా సాయిప్రభో ॥
నీ ద్వారములో నిలిచితిని నిన్నే నిత్యము కొలిచితిని
అభయమునిచ్చి బ్రోవుమయా ఓ శిరిడీశా దయామయా
ధన్యము ద్వారక ఓ మాయీ నీలో నిలిచెను శ్రీసాయి
నీ ధుని మణ్టల వేడిమికి పాపము పోవును తాకిడికి ॥ 5 ॥
శిరిడీవాసా సాయిప్రభో ॥
ప్రళయ కాలము ఆపితివి భక్తులను నీవు బ్రోచితివి
చేసి మహమ్మారీ నాశం కాపాడి శిరిడీ గ్రామం
అగ్నిహోత్రి శాస్త్రికి లీలా మహాత్మ్యం చూపిఞ్చి
శ్యామాను బ్రతికిఞ్చితివి పాము విషము తొలిగిఞ్చి ॥ 6 ॥
శిరిడీవాసా సాయిప్రభో ॥
భక్త భీమాజీకి క్షయరోగం నశియిఞ్చే ఆతని సహనం
ఊదీ వైద్యం చేసావు వ్యాధిని మాయం చేసావు
కాకాజీకి ఓ సాయి విఠల దర్శన మిచ్చితివి
దామూకిచ్చి సన్తానం కలిగిఞ్చితివి సన్తోషమ్ ॥ 7 ॥
శిరిడీవాసా సాయిప్రభో ॥
కరుణాసిన్ధూ కరుణిఞ్చు మాపై కరుణ కురిపిఞ్చు
సర్వం నీకే అర్పితము పెఞ్చుము భక్తి భావమును
ముస్లిం అనుకొని నిను మేఘూ తెలుసుకుని ఆతని బాధ
దాల్చి శివశఙ్కర రూపం ఇచ్చావయ్యా దర్శనము ॥ 8 ॥
శిరిడీవాసా సాయిప్రభో ॥
డాక్టరుకు నీవు రామునిగా బల్వన్తకు శ్రీదత్తునిగా
నిమోనుకరకు మారుతిగా చిదమ్బరకు శ్రీగణపతిగా
మార్తాణ్డకు ఖణ్డోబాగా గణూకు సత్యదేవునిగా
నరసింహస్వామిగా జోషికి దర్శనము నిచ్చిన శ్రీసాయి ॥ 9 ॥
శిరిడీవాసా సాయిప్రభో ॥
రేయి పగలు నీ ధ్యానం నిత్యం నీ లీలా పఠనం
భక్తితో చేయణ్డి ధ్యానం లభిఞ్చును ముక్తికి మార్గం
పదకొణ్డు నీ వచనాలు బాబా మాకవి వేదాలు
శరణని వచ్చిన భక్తులను కరుణిఞ్చి నీవు బ్రోచితివి ॥ 10 ॥
శిరిడీవాసా సాయిప్రభో ॥
అన్దరిలోన నీ రూపం నీ మహిమ అతి శక్తిమయం
ఓ సాయి మేము మూఢులము ఒసగుమయా మాకు జ్ఞానమును
సృష్టికి నీవేనయ మూలం సాయి మేము సేవకులం
సాయి నామము తలచెదము నిత్యము సాయిని కొలిచెదము ॥ 11 ॥
శిరిడీవాసా సాయిప్రభో ॥
భక్తి భావన తెలుసుకొని సాయిని మదిలో నిలుపుకొని
చిత్తముతో సాయీ ధ్యానం చేయణ్డి ప్రతినిత్యం
బాబా కాల్చిన ధుని ఊది నివారిఞ్చును అది వ్యాధి
సమాధి నుణ్డి శ్రీసాయి భక్తులను కాపాడేనోయి ॥ 12 ॥
శిరిడీవాసా సాయిప్రభో ॥
మన ప్రశ్నలకు జవాబులు తెలుపును సాయి చరితములు
వినణ్డి లేక చదవణ్డి సాయి సత్యము చూడణ్డి
సత్సఙ్గమును చేయణ్డి సాయి స్వప్నము పొన్దణ్డి
భేద భావమును మానణ్డి సాయి మన సద్గురువణ్డి ॥ 13 ॥
శిరిడీవాసా సాయిప్రభో ॥
వన్దనమయ్యా పరమేశా ఆపద్బాన్ధవ సాయీశా
మా పాపములూ కడతేర్చు మా మది కోరిక నెరవేర్చు
కరుణామూర్తి ఓ సాయి కరుణతో మము దరిచేర్చోయీ
మా మనసే నీ మన్దిరము మా పలుకులే నీకు నైవేద్యమ్ ॥ 14 ॥
శిరిడీవాసా సాయిప్రభో ॥
అఖిలాణ్డకోటి బ్రహ్మాణ్డనాయక
రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ
శ్రీసచ్చిదానన్ద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై ॥