రాగం: శహన రాగము
తాళం: ఆది తాళము
పల్లవి
వన్దనము రఘునన్దన - సేతు
బన్ధన భక్త చన్దన రామ
చరణము(లు)
శ్రీదమా నాతో వాదమా - నే
భేదమా ఇది మోదమా రామ
శ్రీరమా హృచ్చార మము బ్రోవ
భారమా రాయబారమా రామ
విణ్టిని నమ్ము కొణ్టిని శర
ణణ్టిని రమ్మణ్టిని రామ
ఓడను భక్తి వీడను నొరుల
వేడను జూడను రామ
కమ్మని విడె మిమ్మని వరము
కొమ్మని పలుక రమ్మని రామ
న్యాయమా నీ కాయమా ఇఙ్క
హేయమా ముని గేయమా రామ
చూడుమీ గాపాడుమీ మమ్ము
పోడిమిగా (గూడుమీ రామ
క్షేమము దివ్య ధామము నిత్య
నీమము రామనామము రామ
వేగరా కరుణాసాగర శ్రీ
త్యాగరాజు హృదయాకర రామ