రామదాసు కీర్తన ఇక్ష్వాకు కుల తిలకా
రాగం: యదుకులకామ్భోజి ఆ: స రి2 మ1 ప ద2 స అవ: స ని2 ద2 ప మ1 గ3 రి2 స తాళం: మిశ్రచాపు పల్లవి ఇక్ష్వాకు కులతిలక ఇకనైన పలుకవె రామచన్ద్రా నన్ను రక్షిమ్పకున్నను రక్షకులెవరిఙ్క రామచన్ద్రా .. చరణం 1 భరతునకు చేయిస్తి పచ్చలపతకము రామచన్ద్రా ఆ పతకమునకుబట్టె పదివేల వరహాలు రామచన్ద్రా ॥ ఇక్ష్వాకు కులతిలక ॥ చరణం 2 శత్రుఘ్నునకు నేను చేయిస్తి మొలత్రాడు రామచన్ద్రా ఆ మొలత్రాడునకు బట్టె మొహరీలు పదివేలు రామచన్ద్రా ॥ ఇక్ష్వాకు కులతిలక ॥ చరణం 3 లక్ష్మణునకు జేయిస్తి ముత్యాలపతకము రామచన్ద్రా ఆ పతకమునకు బట్టె పదివేల వరహాలు రామచన్ద్రా ॥ ఇక్ష్వాకు కులతిలక ॥ చరణం 4 సీతమ్మకు చేయిస్తి చిన్తాకు పతకము రామచన్ద్రా ఆ పతకమునకు బట్టె పదివేల వరహాలు రామచన్ద్రా ॥ ఇక్ష్వాకు కులతిలక ॥ చరణం 5 కలికితురాయి నీకు పొలుపుగ జేయిస్తి రామచన్ద్రా నీవు కులుకుచు దిరిగెద వెవరబ్బసొమ్మని రామచన్ద్రా ॥ ఇక్ష్వాకు కులతిలక ॥ చరణం 6 మీ తణ్డ్రి దశరథమహారాజు పెట్టెనా రామచన్ద్రా లేక మీమామ జనకమహారాజు పమ్పెనా రామచన్ద్రా ॥ ఇక్ష్వాకు కులతిలక ॥ చరణం 7 అబ్బా తిట్టితినని యాయాసపడవద్దు రామచన్ద్రా ఈ దెబ్బలకోర్వక అబ్బ తిట్టితినయ్య రామచన్ద్రా ॥ ఇక్ష్వాకు కులతిలక ॥ చరణం 8 భక్తులన్దరిని పరిపాలిఞ్చెడి శ్రీరామచన్ద్రా నీవు క్షేమముగ రామదాసుని నేలుము రామచన్ద్రా ॥ ఇక్ష్వాకు కులతిలక ॥ చరణం 9 చుట్టుప్రాకారములు సొమ్పుగ చేయిస్తి రామచన్ద్రా ఆ ప్రాకారమునకు బట్టె పదివేల వరహాలు రామచన్ద్రా ॥ ఇక్ష్వాకు కులతిలక ॥ చరణం 10 గోపురమణ్టపాలు కుదురుగ గట్టిస్తి రామచన్ద్రా నను క్రొత్తగ జూడక నిత్తరిబ్రోవుము రామచన్ద్రా ॥ ఇక్ష్వాకు కులతిలక ॥ చరణం 11 వాహనములు మీకు వరుసతో జేయిస్తి రామచన్ద్రా జగ న్మోహన సఙ్కెళ్ళు వేసిరి కాళ్ళకు రామచన్ద్రా ॥ ఇక్ష్వాకు కులతిలక ॥ చరణం 12 సర్కారు పైకము తృణముగనెఞ్చకు రామచన్ద్రా దెబ్బలకోర్వను యప్పుదీర్చుమయ్య రామచన్ద్రా ॥ ఇక్ష్వాకు కులతిలక ॥ చరణం 13 ఏటికి జల్లిన నీళ్ళాయె నా బ్రతుకు రామచన్ద్రా నేను అధములన్దరికణ్టె అన్యాయమైతిని రామచన్ద్రా ॥ ఇక్ష్వాకు కులతిలక ॥ చరణం 14 కౌసల్యపుత్రుడ దశరథతనయుడ రామచన్ద్రా కావు క్షేమముగ భద్రాద్రి నెలకొన్న శ్రీరామచన్ద్రా ॥ ఇక్ష్వాకు కులతిలక ॥
Browse Related Categories: