రామదాసు కీర్తన పలుకే బఙ్గారమాయెనా
రాగం: ఆనన్ద భైరవి/ఆనన్ద భైరవి 20 నటభైరవి జన్య ఆ: స గ2 రి2 గ2 మ1 ప ద2 ప ని2 స అవ: స ని2 ద2 ప మ1 గ2 రి2 స తాళం: ఆది పల్లవి పలుకే బఙ్గారమాయెనా, కోదణ్డపాణి పలుకే బఙ్గారమాయెనా చరణం 1 పలుకే బఙ్గారమాయె పిలచినా పలుకవేమి కలలో నీ నామస్మరణ మరువ చక్కని తణ్డ్రీ ॥ పలుకే బఙ్గారమాయెనా ॥ చరణం 2 ఎన్త వేడినగాని సున్తైన దయరాదు పన్తము సేయ నేనెన్తటివాడను తణ్డ్రీ ॥ పలుకే బఙ్గారమాయెనా ॥ చరణం 3 శరణాగతత్రాణ బిరుదాఙ్కితుడవుకాదా కరుణిఞ్చు భద్రాచల వరరామదాస పోష ॥ పలుకే బఙ్గారమాయెనా ॥ చరణం 4 ఇరవుగ ఇసుకలోన పొరలిన ఉడుత భక్తికి కరుణిఞ్చి బ్రోచితివని నెర నమ్మితిని తణ్డ్రీ ॥ పలుకే బఙ్గారమాయెనా ॥ చరణం 5 రాతి నాతిగ చేసి భూతలమున ప్రఖ్యాతి చెన్దితివని ప్రీతితో నమ్మితి తణ్డ్రీ ॥ పలుకే బఙ్గారమాయెనా ॥ పలుకే బఙ్గారమాయె పిలచినా పలుకవేమి కలలో నీ నామస్మరణ మరువ చక్కని తణ్డ్రీ-పలుకే బఙ్గారమాయెనా పలుకే బఙ్గారమాయెనా, కోదణ్డపాణి పలుకే బఙ్గారమాయెనా
Browse Related Categories: