View this in:
English Devanagari Telugu Tamil Kannada Malayalam Gujarati Odia Bengali  |
Marathi Assamese Punjabi Hindi Samskritam Konkani Nepali Sinhala Grantha  |
This document is in శుద్ధ తెలుగు with the right anusvaras marked. View this in సరళ తెలుగు, with simplified anusvaras for easier reading.

అన్నమయ్య కీర్తన సిరుత నవ్వులవాడు


రాగమ్: ఆహిరి
ఆ: స రి1 స గ3 మ1 ప ద1 ని2 స
అవ: స ని2 ద1 ప మ1 గ3 రి1 స

రాగమ్: కురిన్జి
ఆ: స ని3 స రి2 గ3 మ1 ప ద2
అవ: ద2 ప మ1 గ3 రి2 స ని3 స
తాళం: ఆది

పల్లవి
సిరుత నవ్వులవాడు సిన్నెకా
వీడు వెరపెరుగడు సూడవే సిన్నెకా ॥ (2)

చరణం 1
పొలసు మేనివాడు బోరవీపు వాడు
సెలసు మోరవాడు సిన్నెకా । (2)
గొలుసుల వఙ్కల కోరలతోబూమి
వెలిసినాడు సూడవే సిన్నెకా ॥ (2)
సిరుత నవ్వులవాడు సిన్నెకా వీడు..(ప..) (2)

చరణం 2
మేటి కురుచవాడు మెడమీది గొడ్డలి
సీటకాలవాడు సిన్నెకా । (2)
ఆటదానిబాసి అడవిలో రాకాశి
వేటలాడీ జూడవే సిన్నెకా ॥ (2)
సిరుత నవ్వులవాడు సిన్నెకా వీడు..(ప..) (2)

చరణం 3
బిఙ్కపు మోతల పిల్లగోవివాడు
సిఙ్క సూపులవాడు సిన్నెకా ।(2)
కొఙ్కక కలికియై కొసరి కూడె నన్ను
వేఙ్కటేశుడు సూడవే సిన్నెకా ॥ (2)
సిరుత నవ్వులవాడు సిన్నెకా
వీడు వెరపెరుగడు సూడవే సిన్నెకా ॥ (2)




Browse Related Categories: