ఆఞ్జనేయ దణ్డకమ్
శ్రీ ఆఞ్జనేయం ప్రసన్నాఞ్జనేయం ప్రభాదివ్యకాయం ప్రకీర్తి ప్రదాయం భజే వాయుపుత్రం భజే వాలగాత్రం భజేహం పవిత్రం భజే సూర్యమిత్రం భజే రుద్రరూపం భజే బ్రహ్మతేజం బటఞ్చున్ ప్రభాతమ్బు సాయన్త్రమున్ నీనామసఙ్కీర్తనల్ జేసి నీ రూపు వర్ణిఞ్చి నీమీద నే దణ్డకం బొక్కటిన్ జేయ నోహిన్చి నీ మూర్తిగావిఞ్చి నీసున్దరం బెఞ్చి నీ దాసదాసుణ్డనై రామభక్తుణ్డనై నిన్ను నేగొల్చెదన్ (నీ) నన్ కటాక్షమ్బునన్ జూచితే వేడుకల్ చేసితే నా మొరాలిఞ్చితే నన్ను రక్షిఞ్చితే అఞ్జనాదేవి గర్భాన్వయా దేవ నిన్నెఞ్చ నేనెన్తవాడన్ దయాశాలివై జూచియున్ దాతవై బ్రోచియున్ దగ్గరన్ నిల్చియున్ దొల్లి సుగ్రీవుకున్-మన్త్రివై స్వామి కార్యార్థమై యేగి శ్రీరామ సౌమిత్రులం జూచి వారిన్విచారిఞ్చి సర్వేశు బూజిఞ్చి యబ్భానుజుం బణ్టు గావిఞ్చి యవ్వాలినిన్ జమ్పిఞ్చి కాకుత్థ్స తిలకున్ [కృపాదృష్టి] దయాదృష్టి వీక్షిఞ్చి కిష్కిన్ధకేతెఞ్చి శ్రీరామ కార్యార్థమై లఙ్క కేతెఞ్చియున్ లఙ్కిణిన్ జమ్పియున్ లఙ్కనున్ గాల్చియున్ యభ్భూమిజం జూచి యానన్దముప్పొఙ్గి యాయుఙ్గరమ్బిచ్చి యారత్నమున్ దెచ్చి శ్రీరామునకున్నిచ్చి సన్తోషమున్జేసి సుగ్రీవునిన్ యఙ్గదున్ జామ్బవన్తు [న్నలున్నీలులన్] వీరాధులన్ గూడి యాసేతువున్ దాటి వానరుల్మూకలై పెన్మూకలై [యాదైత్యులన్] దైత్యులన్ ద్రుఞ్చగా రావణుణ్డన్త కాలాగ్ని రుద్రుణ్డుగా కోరి [వచ్చి] బ్రహ్మాణ్డమైనట్టి యా శక్తినిన్వైచి యాలక్షణున్ మూర్ఛనొన్దిమ్పగా నప్పుడే పోయి [నీవు] సఞ్జీవినిన్దెచ్చి సౌమిత్రికిన్నిచ్చి ప్రాణమ్బు రక్షిమ్పగ కుమ్భకర్ణాదుల న్వీరులం బోర శ్రీరామ బాణాగ్ని వారన్దరిన్ రావణున్ జమ్పగా నన్త లోకమ్బు లానన్దమై యుణ్డ నవ్వేళను న్విభీషుణున్ వేడుకన్ దోడుకన్ వచ్చి పట్టాభిషేకమ్బు చేయిఞ్చి, సీతామహాదేవినిన్ దెచ్చి [శ్రీరాముకున్నిచ్చి] శ్రీరాముతో చేర్చి, యన్తన్నయోధ్యాపురిన్జొచ్చి పట్టాభిషేకమ్బు సంరమ్భమైయున్న నీకన్న నాకెవ్వరున్ గూర్మి లేరఞ్చు మన్నిఞ్చినన్ శ్రీరామభక్తి ప్రశస్తమ్బుగా నిన్ను [సేవిఞ్చి] నీనామ సఙ్కీర్తనల్ చేసితి పాపముల్ల్బాయునే భయములున్ దీరునే భాగ్యముల్ గల్గునే సకల సామ్రాజ్యముల్ గల్గు సమ్పత్తులున్ కల్గునో వానరాకార యో భక్త మన్దార యో పుణ్య సఞ్చార యో ధీర యో వీర నీవే సమస్తమ్బు నీవే మహాఫలముగా వెలసి యాతారక బ్రహ్మ మన్త్రమ్బు [పఠియిఞ్చుచున్] సన్ధానమున్ చేయుచు స్థిరమ్ముగన్ వజ్రదేహమ్బునున్ దాల్చి శ్రీరామ శ్రీరామయఞ్చున్ మనఃపూతమైన ఎప్పుడున్ తప్పకన్ తలతునా జిహ్వయన్దుణ్డి నీ దీర్ఘదేహమ్ము త్రైలోక్య సఞ్చారివై రామనామాఙ్కిత ధ్యానివై బ్రహ్మవై బ్రహ్మతేజమ్బునన్ రౌద్రనీజ్వాల కల్లోల హావీర హనుమన్త ఓఙ్కార శబ్దమ్బులన్ క్రూరకర్మ గ్రహ భూత ప్రేతమ్బులన్ బెన్ పిశాచమ్బులన్ శాకినీ ఢాకినీ మోహిని త్యాదులన్ గాలిదయ్యమ్బులన్ నీదు వాలమ్బునన్ జుట్టి నేలమ్బడం గొట్టి నీముష్టి ఘాతమ్బులన్ బాహుదణ్డమ్బులన్ రోమఖణ్డమ్బులన్ ద్రుఞ్చి కాలాగ్ని రుద్రుణ్డవై నీవు బ్రహ్మ ప్రభాభాసితమ్బైన నీదివ్య తేజమ్బునున్ జూచి [రారోరి] రారా నాముద్దు నరసింహ యన్చున్ దయాదృష్టి వీక్షిఞ్చి నన్నేలు నాస్వామియో యాఞ్జనేయా నమస్తే సదా బ్రహ్మచారీ నమస్తే వ్రతపూర్ణహారి నమస్తే నమోవాయుపుత్రా నమస్తే నమో నమః
Browse Related Categories: