రామదాసు కీర్తన పలుకే బంగారమాయెనా
రాగం: ఆనంద భైరవి/ఆనంద భైరవి 20 నటభైరవి జన్య ఆ: స గ2 రి2 గ2 మ1 ప ద2 ప ని2 స అవ: స ని2 ద2 ప మ1 గ2 రి2 స తాళం: ఆది పల్లవి పలుకే బంగారమాయెనా, కోదండపాణి పలుకే బంగారమాయెనా చరణం 1 పలుకే బంగారమాయె పిలచినా పలుకవేమి కలలో నీ నామస్మరణ మరువ చక్కని తండ్రీ ॥ పలుకే బంగారమాయెనా ॥ చరణం 2 ఎంత వేడినగాని సుంతైన దయరాదు పంతము సేయ నేనెంతటివాడను తండ్రీ ॥ పలుకే బంగారమాయెనా ॥ చరణం 3 శరణాగతత్రాణ బిరుదాంకితుడవుకాదా కరుణించు భద్రాచల వరరామదాస పోష ॥ పలుకే బంగారమాయెనా ॥ చరణం 4 ఇరవుగ ఇసుకలోన పొరలిన ఉడుత భక్తికి కరుణించి బ్రోచితివని నెర నమ్మితిని తండ్రీ ॥ పలుకే బంగారమాయెనా ॥ చరణం 5 రాతి నాతిగ చేసి భూతలమున ప్రఖ్యాతి చెందితివని ప్రీతితో నమ్మితి తండ్రీ ॥ పలుకే బంగారమాయెనా ॥ పలుకే బంగారమాయె పిలచినా పలుకవేమి కలలో నీ నామస్మరణ మరువ చక్కని తండ్రీ-పలుకే బంగారమాయెనా పలుకే బంగారమాయెనా, కోదండపాణి పలుకే బంగారమాయెనా
Browse Related Categories: