శ్రీమద్వాల్మీకీయ రామాయణే సుందరకాండమ్ ।
అథ సప్తమస్సర్గః ।
స వేశ్మజాలం బలవాన్ దదర్శ వ్యాసక్తవైడూర్యసువర్ణజాలమ్ ।
యథా మహత్ ప్రావృషి మేఘజాలం విద్యుత్పినద్ధం సవిహంగజాలమ్ ॥ 1 ॥
నివేశనానాం వివిధాశ్చ శాలాః ప్రధానశంఖాయుధచాపశాలాః ।
మనోహరాశ్చాపి పునర్విశాలాః దదర్శ వేశ్మాద్రిషు చంద్రశాలాః ॥ 2 ॥
గృహాణి నానావసురాజితాని దేవాసురైశ్చాపి సుపూజితాని ।
సర్వైశ్చ దోషైః పరివర్జితాని కపిర్దదర్శ స్వబలార్జితాని ॥ 3 ॥
తాని ప్రయత్నాభిసమాహితాని మయేన సాక్షాదివ నిర్మితాని ।
మహీతలే సర్వగుణోత్తరాణి దదర్శ లంకాధిపతేర్గృహాణి ॥ 4 ॥
తతో దదర్శోఛ్రచితమేఘరూపం మనోహరం కాంచనచారురూపమ్ ।
రక్షోఽధిపస్యాత్మబలానురూపం గృహోత్తమం హ్యప్రతిరూపరూపమ్ ॥ 5 ॥
మహీతలే స్వర్గమివ ప్రకీర్ణం శ్రియా జ్వలంతం బహురత్నకీర్ణమ్ ।
నానాతరూణాం కుసుమావకీర్ణం గిరేరివాగ్రం రజసావకీర్ణమ్ ॥ 6 ॥
నారీప్రవేకైరివ దీప్యమానం తటిద్భిరంభోదవదర్చ్యమానమ్ ।
హంసప్రవేకైరివ వాహ్యమానం శ్రియా యుతం ఖే సుకృతాం విమానమ్ ॥ 7 ॥
యథా నగాగ్రం బహుధాతుచిత్రం యథా నభశ్చ గ్రహచంద్రచిత్రమ్ ।
దదర్శయుక్తీకృతమేఘచిత్రం విమానరత్నం బహురత్నచిత్రమ్ ॥ 8 ॥
మహీ కృతా పర్వతరాజిపూర్ణా శైలాః కృతా వృక్షవితానపూర్ణాః ।
వృక్షాః కృతాః పుష్పవితానపూర్ణాః పుష్పం కృతం కేసరపత్రపూర్ణమ్ ॥ 9 ॥
కృతాని వేశ్మాని చ పాండురాణి తథా సుపుష్పాణ్యపి పుష్కరాణి ।
పునశ్చ పద్మాని సకేసరాణి ధన్యాని చిత్రాణి తథా వనాని ॥ 10 ॥
పుష్పాహ్వయం నామవిరాజమానం రత్నప్రభాభిశ్చ వివర్ధమానమ్ ।
వేశ్మోత్తమానామపి చోచ్యమానం మహాకపిస్తత్ర మహావిమానమ్ ॥ 11 ॥
కృతాశ్చ వైడూర్యమయా విహంగాః రూప్యప్రవాలైశ్చ తథా విహంగాః ।
చిత్రాశ్చ నానావసుభిర్భుజంగాః జాత్యానురూపాస్తురగాః శుభాంగాః ॥ 12 ॥
ప్రవాలజాంబూనదపుష్పపక్షాః సలీలమావర్జితజిహ్మపక్షాః ।
కామస్య సాక్షాదివ భాంతి పక్షాః కృతా విహంగాః సుముఖాః సుపక్షాః ॥ 13 ॥
నియుజ్యమానాస్తు గజాః సుహస్తాః సకేసరాశ్చోత్పలపత్రహస్తాః ।
బభూవదేవీ చ కృతా సుహస్తా లక్ష్మీ స్తథా పద్మిని పద్మహస్తా ॥ 14 ॥
ఇతీవ తద్గృహమభిగమ్య శోభనం సవిస్మయో నగమివ చారుశోభనమ్ ।
పునశ్చ తత్పరమసుగంధి సుందరం హిమాత్యయే నగమివ చారుకందరమ్ ॥ 15 ॥
తతః స తాం కపిరభిపత్య పూజితాం చరన్ పురీం దశముఖబాహుపాలితామ్ ।
అదృశ్య తాం జనకసుతాం సుపూజితాం సుదుఃఖితః పతిగుణవేగవర్జితామ్ ॥ 16 ॥
తతస్తదా బహువిధభావితాత్మనః కృతాత్మనో జనకసుతాం సువర్త్మనః ।
అపశ్యతోఽభవదతిదుఃఖితం మనః సుచక్షుషః ప్రవిచరతో మహాత్మనః ॥ 17 ॥
ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయ ఆదికావ్యే సుందరకాండే సప్తమస్సర్గః ॥