శ్రీమద్వాల్మీకీయ రామాయణే సుందరకాండమ్ ।
అథ తృతీయస్సర్గః ।
స లంబశిఖరే లంబే లంబతోయదసన్నిభే ।
సత్త్వమాస్థాయ మేధావీ హనుమాన్ మారుతాత్మజః ॥ 1 ॥
నిశి లంకాం మహాసత్త్వో వివేశ కపికుంజరః ।
రమ్యకాననతోయాఢ్యాం పురీం రావణపాలితామ్ ॥ 2 ॥
శారదాంబుధరప్రఖ్యైర్భవనైరుపశోభితామ్ ।
సాగరోపమనిర్ఘోషాం సాగరానిలసేవితామ్ ॥ 3 ॥
సుపుష్టబలసంపుష్టాం యథైవ విటపావతీమ్ ।
చారుతోరణనిర్యూహాం పాండురద్వారతోరణామ్ ॥ 4 ॥
భుజగాచరితాం గుప్తాం శుభాం భోగవతీమివ ।
తాం స విద్యుద్ఘనాకీర్ణాం జ్యోతిర్మార్గనిషేవితామ్ ॥ 5 ॥
మందమారుతసంచారాం యథేంద్రస్యామరావతీమ్ ।
శాతకుంభేన మహతా ప్రాకారేణాభిసంవృతామ్ ॥ 6 ॥
కింకిణీజాలఘోషాభిః పతాకాభిరలంకృతామ్ ।
ఆసాద్య సహసా హృష్టః ప్రాకారమభిపేదివాన్ ॥ 7 ॥
విస్మయావిష్టహృదయః పురీమాలోక్య సర్వతః ।
జాంబూనదమయైర్ద్వారైర్వైడూర్యకృతవేదికైః ॥ 8 ॥
వజ్రస్ఫటికముక్తాభిర్మణికుట్టిమభూషితైః ।
తప్తహాటకనిర్యూహై రాజతామలపాండురైః ॥ 9 ॥
వైఢూర్యకృతసోపానైః స్ఫాటికాంతరపాంసుభిః ।
చారుసంజవనోపేతైః ఖమివోత్పతితైః శుభైః ॥ 10 ॥
క్రౌంచబర్హిణసంఘుష్టైః రాజహంస నిషేవితైః ।
తూర్యాభరణనిర్ఘోషైః సర్వతః ప్రతినాదితామ్ ॥ 11 ॥
వస్వౌకసారాప్రతిమాం తాం వీక్ష్య నగరీం తతః ।
ఖమివోత్పతితుం కామాం జహర్ష హనుమాన్ కపిః ॥ 12 ॥
తాం సమీక్ష్య పురీం రమ్యాం రాక్షసాధిపతేః శుభామ్ ।
అనుత్తమామృద్ధియుతాం చింతయామాస వీర్యవాన్ ॥ 13 ॥
నేయమన్యేన నగరీ శక్యా ధర్షయితుం బలాత్ ।
రక్షితా రావణబలైరుద్యతాయుధధారిభిః ॥ 14 ॥
కుముదాంగదయోర్వాపి సుషేణస్య మహాకపేః ।
ప్రసిద్ధేయం భవేద్భూమిర్మైందద్వివిదయోరపి ॥ 15 ॥
వివస్వతస్తనూజస్య హరేశ్చ కుశపర్వణః ।
ఋక్షస్య కేతుమాలస్య మమ చైవ గతిర్భవేత్ ॥ 16 ॥
సమీక్ష్య తు మహాబాహూ రాఘవస్య పరాక్రమమ్ ।
లక్ష్మణస్య చ విక్రాంతమభవత్ ప్రీతిమాన్ కపిః ॥ 17 ॥
తాం రత్నవసనోపేతాం కోష్ఠాగారావతంసకామ్ ।
యంత్రాగారస్తనీమృద్ధాం ప్రమదామివ భూషితామ్ ॥ 18 ॥
తాం నష్టతిమిరాం దీప్తైర్భాస్వరైశ్చ మహాగృహైః ।
నగరీం రాక్షసేంద్రస్య స దదర్శ మహాకపిః ॥ 19 ॥
థ సా హరిశార్దూలం ప్రవిశంతం మహాబలమ్ ।
నగరీ స్వేన రూపేణ దదర్శ పవనాత్మజమ్ ॥ 20 ॥
సా తం హరివరం దృష్ట్వా లంకా రావణపాలితా ।
స్వయమేవోత్థితా తత్ర వికృతాననదర్శనా ॥ 21 ॥
పురస్తాత్కపివర్యస్య వాయుసూనోరతిష్ఠత ।
ముంచమానా మహానాదమబ్రవీత్పవనాత్మజమ్ ॥ 22 ॥
కస్త్వం కేన చ కార్యేణ ఇహ ప్రాప్తో వనాలయ ।
కథయస్వేహ యత్తత్త్వం యావత్ప్రాణా ధరంతి తే ॥ 23 ॥
న శక్యం ఖల్వియం లంకా ప్రవేష్టుం వానర త్వయా ।
రక్షితా రావణబలైరభిగుప్తా సమంతతః ॥ 24 ॥
అథ తామబ్రవీద్వీరో హనుమానగ్రతః స్థితామ్ ।
కథయిష్యామి తే తత్త్వం యన్మాం త్వం పరిపృచ్ఛసి ॥ 25 ॥
కా త్వం విరూపనయనా పురద్వారేఽవతిష్ఠసి ।
కిమర్థం చాపి మాం రుద్ధ్వా నిర్భర్త్సయసి దారుణా ॥ 26 ॥
హనుమద్వచనం శ్రుత్వా లంకా సా కామరూపిణీ ।
ఉవాచ వచనం క్రుద్ధా పరుషం పవనాత్మజమ్ ॥ 27 ॥
అహం రాక్షసరాజస్య రావణస్య మహాత్మనః ।
ఆజ్ఞాప్రతీక్షా దుర్ధర్షా రక్షామి నగరీమిమామ్ ॥ 28 ॥
న శక్యా మామవజ్ఞాయ ప్రవేష్టుం నగరీ త్వయా ।
అద్య ప్రాణైః పరిత్యక్తః స్వప్స్యసే నిహతో మయా ॥ 29 ॥
అహం హి నగరీ లంకా స్వయమేవ ప్లవంగమ ।
సర్వతః పరిరక్షామి హ్యేతత్తే కథితం మయా ॥ 30 ॥
లంకాయా వచనం శ్రుత్వా హనుమాన్ మారుతాత్మజః ।
యత్నవాన్స హరిశ్రేష్ఠః స్థితశ్శైల ఇవాపరః ॥ 31 ॥
స తాం స్త్రీరూపవికృతాం దృష్టవా వానరపుంగవః ।
ఆబభాషేఽథ మేధావీ సత్త్వవాన్ ప్లవగర్షభః ॥ 32 ॥
ద్రక్ష్యామి నగరీం లంకాం సాట్టప్రాకారతోరణామ్ ।
నిర్విశంకమిమంలోకం పశ్యంత్యాస్తవసాంప్రతమ్ ।
ఇత్యర్థమిహ సంప్రాప్తః పరం కౌతూహలం హి మే ॥ 33 ॥
వనాన్యుపవనానీహ లంకాయాః కాననాని చ ।
సర్వతో గృహముఖ్యాని ద్రష్టుమాగమనం హి మే ॥ 34 ॥
తస్య తద్వచనం శ్రుత్వా లంకా సా కామరూపిణీ ।
భూయ ఏవ పునర్వాక్యం బభాషే పరుషాక్షరమ్ ॥ 35 ॥
మామనిర్జిత్య దుర్బుద్ధే రాక్షసేశ్వరపాలితామ్ ।
న శక్యమద్య తే ద్రష్టుం పురీయం వానరాధమ ॥ 36 ॥
తతః స కపిశార్దూలస్తామువాచ నిశాచరీమ్ ।
దృష్ట్వా పురీమిమాం భద్రే పునర్యాస్యే యథాగతమ్ ॥ 37 ॥
తతః కృత్వా మహానాదం సా వై లంకా భయావహమ్ ।
తలేన వానరశ్రేష్ఠం తాడయామాస వేగితా ॥ 38 ॥
తతః స కపిశార్దూలో లంకయా తాడితో భృశమ్ ।
ననాద సుమహానాదం వీర్యవాన్ పవనాత్మజః ॥ 39 ॥
తతః సంవర్తయామాస వామహస్తస్య సోఽంగులీః ।
ముష్టినాఽఽభిజఘానైనాం హనుమాన్ క్రోధమూర్ఛితః ॥ 40 ॥
స్త్రీ చేతి మన్యమానేన నాతిక్రోధః స్వయం కృతః ।
సా తు తేన ప్రహారేణ విహ్వలాంగీ నిశాచరీ ॥ 41 ॥
పపాత సహసా భూమౌ వికృతాననదర్శనా ।
తతస్తు హనుమాన్ ప్రాజ్ఞస్తాం దృష్ట్వా వినిపాతితామ్ ॥ 42 ॥
కృపాం చకార తేజస్వీ మన్యమానః స్త్రియం తు తామ్ ।
తతో వై భృశసంవిగ్నా లంకా సా గద్గదాక్షరమ్ ॥ 43 ॥
ఉవాచాగర్వితం వాక్యం హనూమంతం ప్లవంగమమ్ ।
ప్రసీద సుమహాబాహో త్రాయస్వ హరిసత్తమ ॥ 44 ॥
సమయే సౌమ్య తిష్ఠంతి సత్త్వవంతో మహాబలాః ।
అహం తు నగరీ లంకా స్వయమేవ ప్లవంగమ ॥ 45 ॥
నిర్జితాహం త్వయా వీర విక్రమేణ మహాబల ।
ఇదం తు తథ్యం శృణు వై బ్రువంత్యా మే హరీశ్వర ॥ 46 ॥
స్వయంభువా పురా దత్తం వరదానం యథా మమ ।
యదా త్వాం వానరః కశ్చిద్విక్రమాద్వశమానయేత్ ॥ 47 ॥
తదా త్వయా హి విజ్ఞేయం రక్షసాం భయమాగతమ్ ।
స హి మే సమయః సౌమ్య ప్రాప్తోఽద్య తవ దర్శనాత్ ॥ 48 ॥
స్వయంభూ విహితః సత్యో న తస్యాస్తి వ్యతిక్రమః ।
సీతానిమిత్తం రాజ్ఞస్తు రావణస్య దురాత్మనః ॥ 49 ॥
రక్షసాం చైవ సర్వేషాం వినాశః సముపాగతః ।
తత్ప్రవిశ్య హరిశ్రేష్ఠ పురీం రావణపాలితామ్ ॥ 50 ॥
విధత్స్వ సర్వకార్యాణి యాని యానీహ వాంఛసి ।
ప్రవిశ్య శాపోపహతాం హరీశ్వర శుభాం పురీం రాక్షసముఖ్యపాలితామ్ ।
యదృచ్ఛయా త్వం జనకాత్మజాం సతీం విమార్గ సర్వత్ర గతో యథాసుఖమ్ ॥ 51 ॥
ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయ ఆదికావ్యే సుందరకాండే తృతీయస్సర్గః ॥